Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‎గా దిల్ రాజు ప్రమాణస్వీకారం

Dil Raju: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‎గా దిల్ రాజు ప్రమాణస్వీకారం

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju)కు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఇవాళ బుధవారం(డిసెంబర్) దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‎గా(TFDC) గా పదవీకి ప్రమాణ శ్రీకారం చేశారు.

ఈ మేరకు హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ వద్ద గల FDC కాంప్లెక్స్‌లోని కార్యాలయంలో ఈ బుధవారం ఉదయం 10:30 గంటలకు నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

ఈ సందర్బంగా దిల్ రాజు మాట్లాడుతూ.. 'ఈ  అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తానని' నిర్మాత దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు. 

అయితే, ఇవాళే DEC 18న దిల్ రాజు పుట్టిన రోజు సందర్బంగా ఈ పదవిని చేపట్టడం విశేషం అని చెప్పుకోవాలి. దిల్‌రాజు అసలు పేరు వెలమకుచ వెంకటరమణారెడ్డి కాగా.. దిల్ సినిమా సక్సెస్ కావడంతో ఆయన పేరు వెంకటరమణారెడ్డి కాస్త దిల్ రాజుగా మారింది.

Also Read:- ఆస్కార్ రేసు నుండి లపతా లేడీస్ ఔట్..

ప్రస్తుతం దిల్ రాజు భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. అందులో వెంకటేష్‌, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సంక్రాంతికి వస్తున్నాం, నితిన్‌, వేణు శ్రీరామ్‌ కాంబోలో తెరకెక్కుతోన్న తమ్ముడు సినిమాలకు కూడా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దిల్ రాజు  నిర్మించిన రెండు భారీ ప్రాజెక్టులు గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.