టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు సంధ్య థియేటర్ గతంలో తీవ్రంగ గాయపడి చికిత్స పొందుతన్న బాలుడు శ్రీతేజ ని కిమ్స్ హాస్పిటల్ లో పరామర్శించాడు. ఈ సందర్భంగా ప్రెస్ తో మాట్లాడుతూ శ్రీ తేజ ఆరోగ్యం గురించి డాక్టర్లని అడిగి తెలుసుకున్నానని అన్నారు. అలాగే శ్రీతేజ తొందరగానే కోలుకుంటున్నాడని అన్నాడు.
ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని ఇక రేవతి కుటుంబానికి అండగా నిలిచి ఆదుకుంటామని అన్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని తెలిపారు. ఈ క్రమంలో ఇటీవల TFDC కు చైర్మన్ గా నియమించే సమయంలో ఇండస్ట్రీ కు ప్రభుత్వం కు బ్రిడ్జి గా పని చెయ్యాలని చెప్పారు. అలాగే శ్రీతేజ తండ్రి భాస్కర్ కి ఇండస్ట్రీ లో ఉద్యోగం ఇచ్చే ఆలోచన గురించి సిఎం కు చెప్తే..సిఎం మంచి నిర్ణయం అని చెప్పారని అన్నారు.
Also Read :- మళ్లీ ఎప్పుడు పిలిస్తే అపుడు విచారణకు రావాలె
ఇక అల్లు అర్జున్ ను కూడా కలసి అన్ని విషయాలు తెలుసుకుంటానని వెల్లడించాడు. తర్వాత భాస్కర్ ను అన్ని విధాలుగా అండగా ఉంటానాని హామీ ఇచ్చారు. త్వరలనే ఇండస్ట్రీకి సంబందించిన పెద్దలతో కలసి ముఖ్యమంత్రిని కలుస్తామని కూడా తెలిపారు. రేపు లేదా ఎల్లుండి సీఎం గారు అపాయిన్మెంట్ ఇస్తాను అన్నారు. ఇండస్ట్రీ నుంచి కొంతమంది పెద్దలతో సీఎం గారిని కలవబోతున్నాము. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇండస్ట్రీని దూరం చెయ్యడం లేదు.. రకరకాల న్యూస్ లు వస్తున్నాయి.. అన్ని వార్తలు అవాస్తవమని కొట్టి పారేశారు.