హీరో అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హుటా హుటిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అతనితో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వెళ్లినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో అల్లు అర్జున్ అరెస్ట్ పై దిల్ రాజు ఎలాంటి విషయాలు తెలుపునున్నాడో తెలియాల్సి ఉంది.
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం దిల్ రాజును తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించింది. మరి అల్లు అర్జున్ అరెస్ట్ పై నిర్మాతగా మాట్లాడుతాడా? లేక ప్రభుత్వం నిమించిన కార్పొరేషన్ చైర్మన్ గా మాట్లాడుతాడా అనేది ఆసక్తిగా మారింది.
అయితే అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ కి వచ్చాడు. దీంతో అక్కడ ఫ్యాన్స్ పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా బాలుడు తీవ్ర అస్వస్థతకి గురయ్యాడు. దీంతో సంధ్య థియేటర్ ఘటనపై చిక్కడపల్లి పోలీసుల కేసు నమోదు చేశారు. తాజాగా ఇవాళ శుక్రవారం అరెస్ట్ అయ్యారు.