మా బ్యాంక్ లాకర్లు కూడా ఓపెన్ చేసి చూశారు : ఐటీ దాడులపై దిల్ రాజు భార్య

మా బ్యాంక్ లాకర్లు కూడా ఓపెన్ చేసి చూశారు : ఐటీ దాడులపై దిల్ రాజు భార్య

దిల్ రాజు ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలపై దిల్ రాజు భార్య తేజస్విని స్పందించారు. మంగళవారం (21 జనవరి) ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని ఆమె తెలిపారు. ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, ఇతర వివరాలను అందించామని చెప్పారు. 

ఐటీ సోదాల్లో భాగంగా  బ్యాంకు డీటెయిల్స్ కావాలని అధికారులు అడిగారని తేజస్విని తెలిపారు. అదేవిధంగా అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయమన్నట్లు చెప్పారు. బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసి చూపించినట్లు తేజస్విని తెలిపారు. 

Also Read :- ఓటీటీలోకి కంగనా పొలిటికల్ డ్రామా

ఐటీ అధికారులు మంగళవారం (21 జనవరి) ఉదయం నుంచి తెలుగు సినీ ప్రముఖుల ఇళ్లు, ఆఫీసుల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా దిల్ రాజు నిర్మాణ సంస్థ, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మూవీ మేకర్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఐటీ అధికారులు 55 బృందాలుగా 8 చోట్ల ఒకేసారి సోదాలు చేస్తున్నారు.  గచ్చిబౌలి,హైటెక్ సిటీ, కొండాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.