దుబాయ్లోనే నిర్మాత కేదార్ అంత్యక్రియలు పూర్తి..

దుబాయ్లోనే నిర్మాత కేదార్ అంత్యక్రియలు పూర్తి..

పదిరోజుల క్రితం దుబాయ్ లో మరణించిన నిర్మాత కేదార్ అంత్యక్రియలు దుబాయ్ లోనే పూర్తయ్యాయి. ఆయన మృతి చుట్టూ అనుమానాలు నెలకొన్న క్రమంలో దర్యాప్తు జరిపిన దుబాయ్ పోలీసులు కేదార్ మరణం వెనక ఎలాంటి కుట్ర లేదని స్పష్టం చేశారు. అనంతరం కేదార్ మృతదేహాన్ని భార్య రేఖా వీణకు అప్పగించారు దుబాయ్ పోలీసులు . ఆయన అంత్యక్రియలు దుబాయ్ లోనే నిర్వహించాలని నిర్ణయించిన కుటుంబసభ్యులు మంగళవారం ( మార్చి 4, 2025 ) అంత్యక్రియలు పూర్తి చేశారు. 

అటు టాలీవుడ్ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిన కేదార్ మరణం సహజ మరణమేనని అధికారులు ధ్రువీకరించారు. ఈ కేసును కొన్ని వర్గాలు వివిధ కోణాల్లో విశ్లేషించిన క్రమంలో దర్యాప్తు జరిపిన పోలీసులు అనుమానాలు క్లియర్ చేస్తూ క్లీన్ చిట్ ఇచ్చారు.

అందుకే దుబాయ్ లోనే అంత్యక్రియలు:

కేదార్ మరణం రాజకీయంగా దుమరానికి దారి తీస్తుందని బావించటమే అంత్యక్రియలు దుబాయ్ లో నిర్వహించటానికి కారణంగా తెలుస్తోంది. కేదార్ అంత్యక్రియల్లో రాజకీయ, సినీ ప్రముఖులు లేకుండా కుటుంబసభ్యులు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 కేదార్ మరణం కారణంగా, ఇండియాలో ఎటువంటి వివాదాలు తలెత్తకుండా కుటుంబం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

అంత్యక్రియలకు దూరంగా రాజకీయ, సినీ ప్రముఖులు

కేదార్ అంత్యక్రియల్లో రాజకీయ సినీ ప్రముఖులు ఎవరూ పాల్గొనలేదు. కేదార్ అంత్యక్రియలు ఎటువంటి హడావిడి లేకుండా కుటుంబసభ్యుల మధ్య పూర్తయ్యాయి. కేదార్ మరణంపై రాజకీయ వర్గాల్లో వివాదాలు కొనసాగుతున్నాయి.