తెలంగాణ జానపద కళారూపమైన ఒగ్గు కథ నేపథ్యంలో రాంబాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘బ్రహ్మాండ’. ఆమని ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దాసరి మమత సమర్పణలో సురేష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి లాంచ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘ తెలుగు సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఒగ్గు కళాకారులు, వారి సంస్కృతి సాంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రమిది.
ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే, డివోషనల్, థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటుంది’ అని చెప్పాడు. ‘అఖండ’ ప్రొడ్యూసర్ మా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేయడం సంతోషంగా ఉందని దాసరి సురేష్ అన్నారు. వరికుప్పల యాదగిరి సంగీతం అందిస్తున్నాడు.