నమ్మకమా.. అతినమ్మకమా? తేడా కొట్టిందంటే అంతే సంగతులు!

మెగా హీరో వైష్ణవ్ తేజ్(Vaishnav tej) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఆదికేశవ(Aadikeshava). లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి(Srikanth reddy) తెరకెక్కిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ ఫిలిమ్స్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. కామెడీ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికీ ఈ సినిమా నుండి రిలీజైన టీజర్ అండ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. 

అయితే ఈ సినిమా విషయంలో నిర్మాత నాగవంశీ ఓవర్ కాన్ఫిడెన్స్ చుపిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి ఈ ఆదికేశవ నవంబర్ 24న రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ.. నవంబర్ 23న సాయంత్రం ఆదికేశవ పైడ్ ప్రివ్యూస్ వేస్తున్నామని ప్రకటించారు. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. మా సంస్థ నుండి వచ్చిన గత సినిమాలు సార్, మ్యాడ్ సినిమాలకు కూడా ఇలాగే పైడ్ ప్రివ్యూస్ వేశాము. వాటికి మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు ఆదికేశవ విషయంలో కూడా అదే నమ్మకంతో ఉన్నాము. మాది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు.. సినిమాపై మాకున్న నమ్మకం అని చెప్పుకొచ్చారు. 

అయితే ఈ విషయం తెలుసుకున్న ఆడియన్స్ అండ్ నెటిజన్స్ మాత్రం రకరకాలుగా కామెంట్స్ చెసాతున్నారు. ఆదికేశవ ట్రైలర్ చూస్తుంటే ఇది ఒక రొటీన్ కమర్షియల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది. చెప్పుకోవడానికి కొత్త పాయింట్ ఏమీ కనిపించడం లేదు  దానికోసం అంత ఓవర్ చేయాలా. ఒకవేళ తేడా కొట్టిందంటే అంతే సంగతులు. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిర్మాత నాగవంశీ ఆదికేశవ సినిమాపై పెట్టుకున్న నమ్మక నిజమవుతుందా అనేది చూడాలి. 

ALSO READ : తెలంగాణలో బీఆర్‌‌‌‌ఎస్, కాంగ్రెస్ హామీలు నమ్మొద్దు : పడాల శ్రీనివాస్

  •  
  • Beta
Beta feature