టాలీవుడ్ లో హిట్టు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు నిర్మిస్తున్నాడు ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇటీవలే ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రానికి నిర్మాత నాగవంశీ డిస్ట్రిబ్యూటర్ వ్యవహరించాడు. ఈ క్రమంలో పెద్ద మొత్తంలోనే లాభాలు గడించారు.
ప్రీమియర్ షోల గురించి నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులోభాగంగా మాస్ సినిమాలకి ప్రీమియర్ షోల వల్ల మంచి బెనిఫిట్ ఉంటుందని, ఎందుకంటే డైలాగ్ డెలివరీ, మేకింగ్ విధానం, ఎలివేషన్స్ తదితర విషయాల్లో క్లాస్ సినిమా మరియు మాస్ సినిమాకి చాలా తేడా ఉంటుందని దాంతో మాస్ సినిమా ఉదయం సమయంలో చూడటం వల్ల కొంతమేర బెనిఫిట్ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలాగే క్లాస్ సినిమాలని మార్నింగ్ షో, లేదా ఈవినింగ్ షో సమయంలో చూస్తే సినిమా టెక్నిక్స్, డైలాగ్స్ అన్ని బాగా అర్థం అవుతాయని అందుకే చాలామంది క్లాస్ సినిమాలకి ప్రీమియర్ షోలు వెయ్యరని చెప్పుకొచ్చాడు.
ఇక ఆ మధ్య మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం చిత్రాన్ని మాస్ సినిమాగా ప్రమోషన్ చేశామని, ఇలా కాకుండా క్లాస్ సినిమాగా ప్రమోట్ చేసి ఉంటే రిజల్ట్ ఇంకోలా ఉండేదమోనని తెలిపారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నిర్మాత నాగవంశీ టాలీవుడ్ రౌడీ విజయ్ దేవర కొండ హీరోగా నటిస్తున్న చిత్రానికి నిర్మాతగా వ్యవరిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ స్టార్ డైరెక్టర్ గౌతమ్ తన్నూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.