
ప్రొడ్యూసర్ నాగవంశీ మీడియాపై ఫైర్ అయ్యారు. నేడు (ఏప్రిల్ 1న) ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఎన్నడూలేని విధంగా, మీడియాపై అసహనం వ్యక్తం చేశారు.
నాగవంశీ మాట్లాడుతూ.. ‘మ్యాడ్ స్క్వేర్’రిలీజైన రోజు (28 మార్చి) కొంతమంది నెగెటివ్ ప్రచారం చేశారు. సినిమా బాలేదని, కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతోందని' మాట్లాడారు. అప్పుడు రిలీజైన రోజు ప్రెస్ మీట్ పెట్టాను. కానీ, ఎందుకులే అని ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు అనుకున్నా. కానీ, ప్రస్తుతం సినిమా థియేటర్లలో బాగా ఆడుతున్నప్పటికీ.. ఆ రివ్యూల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే, ఇలాంటివి మరి ఎక్కువ అవ్వకూడదు కదా అని నాగవంశీ అన్నారు.
Naa Cinemalu Ban cheyyandi.. Ads Teesukokandi. Reviews Raayakandi.#NagaVamsi fires on websites & media.. #MadSquare
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) April 1, 2025
pic.twitter.com/1ysLNBVOZD
ఇప్పటికీ కూడా మాపై అంతగా పగ ఉంటే.. దమ్ముంటే నా సినిమాలు బ్యాన్ చేసి చూపించండి. నా సినిమా ఆర్టికల్స్ రాయకండి. నా దగ్గర యాడ్ తీసుకోకండి. నా సినిమాల రివ్యూలు రాయకండి. చూద్దాం.. నా సినిమాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు. వెబ్ సైట్లు రాస్తేనే, మా సినిమాలు ఆడట్లేదు కదా అని నాగవంశీ ప్రశ్నించారు.
ALSO READ : మీడియాపై నిర్మాత నాగవంశీ ఫైర్: ఇలానే కంటిన్యూ అయితే, మా దారి మాది.. మీ దారి మీది
సినిమాలు ఆడితేనే మీరూ ఉంటారు. లేకపోతే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి.. అని నాగవంశీ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాతలు, మీడియా కలిసి పనిచేస్తేనే ఇద్దరికీ మంచిదని నాగవంశీ గుర్తుచేశారు.