స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Soddu Jonnalagadda) హీరోగా వచ్చిన డీజే టిల్లు(DJ Tillu) ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు విమల్ కృష్ణ(Vimal krishna)తెరకెక్కించిన ఈ టిపికల్ కామెడీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. ఇక డీజే టిల్లుగా సిద్దు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ హంగామాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు సిద్దు.
డీజే టిల్లు సీక్వెల్గా టిల్లు స్క్వేర్ సినిమా హంగామా జోరుగా ఉంది.ఈ క్రేజీ సీక్వెల్ను దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కిస్తున్నాడు. మొదటి పార్ట్ ను నిర్మించిన సితార ఎంటెర్టైన్మెంట్స్ ఈ సీక్వెల్ను కూడా నిర్మిస్తున్నారు.అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా రేపు (మార్చ్ 29న) ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో..ప్రొడ్యూసర్ నాగవంశీ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదేమిటంటే ఈ సినిమాకి సంబంధించి మీడియా వాళ్ళ కోసం ఎలాంటి స్పెషల్ షో వేయకూడదని డిసైడ్ అయ్యాడట.
వివరాల్లోకి వెళితే..సాధారణంగా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ చిన్న సినిమా వస్తోన్నస్పెషల్ షోస్ను మీడియా ప్రతినిధుల కోసం వేసే ఆచారం చాలా కాలంగా వస్తోంది.అలాగే కొన్ని సినిమాలను మాత్రం రిలీజ్ అయిన రోజు మార్నింగ్ షో అయిన వేస్తూ వస్తున్నారు.అయితే, ఇలాంటి స్పెషల్ షోస్ టిల్లు స్క్వేర్ సినిమాకి లేవని సమాచారం.ఈ లెక్కన చూస్తుంటే నిర్మాత నాగవంశీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఈ మధ్య కాలంలో ఇలాంటి డెసిషన్ తీసుకోబోతున్న నిర్మాత నాగవంశీ అనే చెప్పుకోవాలి.గతంలో ఇస్మార్ట్ శంకర్ మూవీ రిలీజ్ టైంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మాత్రమే ప్రెస్కి షో వేయలేదు.ఎందుకంటే,పూరీకి ఆ సినిమా మీద ఉన్న బలమైన నమ్మకంతోనే ఇలాంటి డెసిషన్ తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.
ఇప్పుడు కూడా టిల్లు స్క్వేర్ కంటెంట్ మీద ఉన్న బలమైన కాన్ఫిడెన్స్ తోనే నాగ వంశీ ఈ డెసిషన్ తీసుకున్నట్లు సినీ సర్కిల్ లో వినిపిస్తోంది.అయితే,ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తోన్న ప్రచారంపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.రేపటి లోపు ఈ గాసిప్స్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఈ మధ్య కాలంలో మీడియా వాళ్లు ఇచ్చే రివ్యూస్ మీద కాస్త నెగటివ్ అభిప్రాయం కలిగి ఉన్నందున..మేకర్స్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని మాట కూడా వినిపిస్తోంది.