Tollywood Vs Bollywood: టాలీవుడ్, బాలీవుడ్ రౌండ్ టేబుల్‌ చర్చ.. పెద్ద రచ్చగా మారేలా ఉందే!

Tollywood Vs Bollywood: టాలీవుడ్, బాలీవుడ్ రౌండ్ టేబుల్‌ చర్చ.. పెద్ద రచ్చగా మారేలా ఉందే!

బాలీవుడ్ వర్సెస్ సౌత్ రౌండ్ టేబుల్‌ చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 2024 ముగింపును పురస్కరించుకొని ఇటీవల ఓ వెబ్‌సైట్‌ దక్షిణాదితోపాటు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాతలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించింది. ఇందులో టాలీవుడ్ నుంచి నిర్మాత నాగవంశీ పాటు హీరో సిద్దార్థ్, బాలీవుడ్ నుంచి సీనియర్ ప్రొడ్యూసర్ బోనీకపూర్‌ పాల్గొన్నారు.

బోనీ కపూర్ మాట్లాడుతూ.. 'తెలుగు సినిమాలకు అమెరికాలో మంచి మార్కెట్ ఉందని.. అందుకే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయనేలా చెప్పారు. అలాగే తెలుగు చిత్రాలకు యూఎస్‌, తమిళ మూవీలకు సింగపూర్‌, మలేషియా, గల్ఫ్‌లో మార్కెట్‌ బాగుంటుందని' తెలిపారు.

ఇక ఆ వెంటనే నాగవంశీ మాట్లాడుతూ.. "బాలీవుడ్ ప్రేక్షకులు సినిమాను చూసే విధానాన్ని దక్షిణాది ఇండస్ట్రీలు మార్చేశాయని నాగవంశీ అన్నారు. ఇది మీరు ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే, బాలీవుడ్ వెస్ట‌ర్న్ స్టైల్ సినిమాలు చేయ‌డంలో మేకర్స్ బిజీ అయిపోయారు. RRR, బాహుబ‌లి త‌ర్వాత బాలీవుడ్ పెద్ద సినిమాలు చేయ‌డం ప్రారంభించారు.

ఇకపోతే పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు ముంబైలో ఎవ్వ‌రూ ప్ర‌శాంతంగా నిద్ర‌పోలేదు.. అని కాస్త హార్ష్‌గా మాట్లాడిన‌ట్టు అర్థమైంది. అంతేకాకుండా బోణి కపూర్ మాట్లాడుతూ.. యానిమ‌ల్‌, జవాన్ సినిమాలు బాలీవుడ్‌లో పెద్ద హిట్ మూవీస్ గా నిలిచి చరిత్ర సృష్టించాయి అని అన్నారు. దానికి వెంటనే నాగ వంశీ మాట్లాడుతూ.. ఆ రెండు సినిమాల డెరెక్ట‌ర్స్ సౌత్ నుంచే వ‌చ్చార‌ని చెప్పడంతో అదోరకమైన అర్ధాలు క్రియేట్ అయ్యాయి. 

ALSO READ | Ticket Prices: ఏపీలో భారీగా పెరగనున్న టికెట్టు ధరలు.. సంక్రాంతి సినిమాలకి ఎంత పెంచనుందంటే?

అయితే, ఇక్కడ బోనీ కపూర్ వాదనలతో నాగవంశీ ఏకీభవించకుండా వెంటనే తన వైఖరిని వివరించాడు. దాంతో వారిద్దరి మధ్య సాగిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. బోనీ కపూర్ వంటి సీనియర్ నిర్మాతను నాగ వంశీ అగౌరవపరిచారని చాలా మంది బాలీవుడ్  దర్శక నిర్మాత సంజయ్‌ గుప్తా ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంజయ్ గుప్తా ట్విట్టర్లో నాగ వంశీ మాట్లాడిన మాటలపై వరుస ట్వీట్స్ చేశాడు. అందులో ఒకటి.. "బోనీకపూర్‌ లాంటి సీనియర్ నిర్మాత పక్కన కూర్చొని తన వ్యాఖ్యలతో ఆయన్ని ఎగతాళి చేస్తున్న ఈ వ్యక్తి ఎవరు? అతడి వైఖరి ఏమీ బాలేదు. నాలుగు హిట్స్‌ అందుకున్నంత మాత్రాన అతడు బాలీవుడ్‌కు రాజు కాలేడు. టాలీవుడ్‌కు చెందిన సీనియర్‌ నిర్మాతలు అల్లు అరవింద్‌, సురేశ్‌బాబు వంటి వారితోనూ ఇదేవిధంగా మాట్లాడగలడా? విజయం అందుకోవడం మాత్రమే కాదు.. గౌరవం ఇవ్వడం కూడా నేర్చుకోవాలని" ఆగ్రహం వ్యక్తంచేశారు. దాంతో నాగ వంశీ మాట్లాడిన మాటలపై సోషల్‌మీడియాలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక ఆ వెంటనే నాగ వంశీ వివరణ ఇస్తూ ట్వీట్ చేశారు. 

‘‘పెద్దలను ఎలా గౌరవించాలో మీరు నేర్పాల్సిన అవసరం లేదు. మీకంటే ఎక్కువగా మేము బోనీ కపూర్‌ను గౌరవిస్తాం. ఆయన్ని అగౌరవపరిచేలా నేను ఆ సంభాషణ చేయలేదు. ఇది ఆరోగ్యకరమైన చర్చ. మేమిద్దరం చక్కగా నవ్వుతూ మాట్లాడుకున్నాం. ఇంటర్వ్యూ తర్వాత పరస్పరం ఆలింగనం చేసుకున్నాం. కాబట్టి దయచేసి మీరు ఇలాంటివి చూసి ఒక ఆలోచనకు రాకండి" అని పోస్ట్ లో వెల్లడించారు.

ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ట్వీట్స్, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. మరి నార్త్ అండ్ సౌత్ చర్చ.. ఎలాంటి రచ్చగా మారనుందో చూడాలి.  ఇకపోతే 2024 ఏడాదిలో ల‌క్కీ భాస్క‌ర్‌, డీజే టిల్లు సినిమాల‌తో నాగ వంశీ పెద్ద హిట్ కొట్టారు.