ఇంకెన్ని దశాబ్దాలు అయినా, ఈ కాలర్ దింపే ఛాన్స్ రాదన్న: నిర్మాత నాగ‌వంశీ

ఇంకెన్ని దశాబ్దాలు అయినా, ఈ కాలర్ దింపే ఛాన్స్ రాదన్న: నిర్మాత నాగ‌వంశీ

మ్యాడ్ స్క్వేర్ మార్చి 28న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి సూపర్ హిట్ అయింది. కామెడీ పంచడమే ప్రధాన లక్ష్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ను వీపరీతంగా అలరిస్తోంది. రిలీజైన 5 రోజుల్లోనే రూ.74కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి దూసుకెళ్తోంది. శుక్రవారం (ఏప్రిల్ 4) వరకు రూ.39.95కోట్లకి పైగా షేర్ వసూళ్లు సాధించింది. 

ఈ సందర్భంగా మేకర్స్ ‘మ్యాడ్ మ్యాక్స్ సెలబ్రేషన్స్’పేరుతో శుక్రవారం సక్సెస్ మీట్‌‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ రావడం, అదిరిపోయే స్పీచ్ ఇవ్వడం, నటి నటులను, టెక్నీషియన్స్ ను ప్రశంసించడం బూస్ట్ ఇచ్చినట్లైంది. ముఖ్యంగా మ్యాడ్ స్క్వేర్ నిర్మాత నాగ‌వంశీకి మంచి ఆనందాన్ని ఇచ్చింది. స్వతహాగా ఎన్టీఆర్కి వీరాభిమాని అయిన నాగవంశీ.. తన అభిమాన హీరో వచ్చి తన సినిమాకు అండగా నిలవడం బలాన్ని ఇచ్చింది. 

ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ X వేదికగా ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని చూపించాడు. "ఇంకా ముందొచ్చే ఎన్ని దశాబ్దాలు అయినా, ఈ కాలర్ దింపే ఛాన్స్ రాదన్న.. ప్రేమతో మీ వీరాభిమాని" అంటూ ఎన్టీఆర్ కాలర్ ఎగరేసే ఫోటో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. నీ లాంటి అభిమాని ఎన్టీఆర్తో సినిమా తీయాలి అంటూ పోస్టులు పెడుతున్నారు. 

ఈ క్రమంలో నాగవంశీ నిర్మాణ సంస్థ సితార X లో స్పందిస్తూ.. 'గుర్తుంచుకోదగ్గ రాత్రి! సరదా క్షణాల నుండి మరపురాని చీర్స్ వరకు, ఎన్టీఆర్ రాకతో బ్లాక్ బస్టర్ మ్యాక్స్ వేడుకలు తదుపరి స్థాయిలో ఉన్నాయి!' అంటూ తెలిపింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ మాట్లాడిన బ్లాక్ బాస్టర్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.