
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ ఇటీవలే మ్యాడ్ స్క్వేర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన కొన్ని వాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఆమధ్య నిర్మాత నాగవంశీ మ్యాడ్ స్క్వేర్ సినిమాలోని హీరో సంగీత్ శోభన్ తో కలసి చేసిన ఇంటర్వూలో జాన్వీ కపూర్ తండ్రి బోణీ కపూర్ గురించి మాట్లాడుతూ అంత అందమైన అమ్మయిని కన్న తండ్రితో మనమెందుకు గొడవపడుతాం అంటూ కామెంట్లు చేశాడు.
అయితే బుధవారం జరిగిన మ్యాడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమాల రివ్యూ రేటింగులు గురించి మాట్లాడుతూ తాను రేటింగ్ కల్చర్ ని నమ్మనని అలాగే ఆడియన్స్ కొన్న టికెట్ కి తన సినిమా న్యాయం చేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తానని అంతేతప్ప ఇతర విషయాల్ని పట్టించుకోనని చెప్పుకొచ్చాడు. ఇక బోణీ కపూర్ టాపిక్ మళ్ళీ రాగా ఈసారి కూడా అందమైన అమ్మాయిని కన్న తండ్రిని మనమెందుకు ప్రశ్నిస్తాం.. అలాగే అందమైన అమ్మాయిలని కన్న తల్లిదండ్రులు జెనెరల్ గానే తప్పులు చెయ్యరని అభిప్రాయం వ్యక్తం చేశాడు. దీంతో నెటిజన్లు ఇదేం లాజిక్ వంశీ బ్రో అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా మ్యాడ్ స్క్వేర్ సినిమా గురువారం (మార్చ్ 27) ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈరోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘మ్యాడ్’ సెన్సేషనల్ హిట్ సీక్వెల్‌గా వస్తోన్న సినిమా ‘మ్యాడ్ స్క్వేర్’ (MAD Square)కి కూడా ప్రీ రిలీజ్ బుకింగ్స్ బాగానే వచ్చినట్లు సమాచారం. ‘మ్యాడ్’లో చూసిన దాని కంటే ఎక్కువ ఫన్, ఆడియన్స్ ఊహించేదాని కంటే ఎక్కువ మ్యాడ్‍నెస్ ఇందులో ఉండనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. సీక్వెల్ కూడా అంతకు మించి ఉంటుందనేలా ట్రైలర్ లో డైలాగ్స్ అదిరిపోయాయి.