అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా స్టోరీ లీక్ చేసిన ప్రొడ్యూసర్.. మరో ఇండస్ట్రీ హిట్ తప్పదా..?

అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా స్టోరీ లీక్ చేసిన ప్రొడ్యూసర్.. మరో ఇండస్ట్రీ హిట్ తప్పదా..?

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ ఈ మధ్య వరుస సినిమాలని నిర్మిస్తూ దూసుకుపోతున్నాడు. అంతేకాదు సినిమాలని కరెక్ట్ టైమ్ కి రిలీజ్ చేస్తూ డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టం రాకుండా సేఫ్ గా ల్యాండ్ చేస్తున్నాడు. ప్రస్తుతం నాగవంశీ తెలుగులో ‘మ్యాడ్ స్క్వేర్’ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించాడు.ఈ సినిమా మార్చ్ 28న రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీ మాట్లాడుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాపై ఆసక్తికర విషయాలు తెలియజేశాడు.. 

అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలిపాడు. ఇందులో ముఖ్యంగా అందరికీ తెలిసిన ఓ గాడ్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు. ఈ సినిమా చూసి యావత్ దేశమంతా ఆశ్చర్యానికి గురవుతుందని చెప్పుకొచ్చాడు. కానీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయాలు మాత్రం తెలియజేయలేదు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఇప్పటివరకూ అల్లు అర్జున్ మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ జోనర్ ని టచ్ చెయ్యలేదు. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఫస్ట్ టైమ్ ఈ మైథలాజికల్ జోనర్ లో చేస్తుండటంతో ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

ALSO READ | బెట్టింగ్ యాప్స్ కేసులో బిగ్ అప్డేట్.. రానా, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్ ఇవే

అయితే ప్రస్తుతం నాగవంశీ తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ అనే సినిమా ని నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి తెలుగు ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మే నెలలో పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇటీవలే వచ్చిన టైటిల్ టీజర్, సౌంబ్ద్ ట్రాక్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.