టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్యాన్ ఇండియా సీక్వెల్ పుష్ప 2: ది రూల్ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం పుష్ప 2 చిత్ర మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకి నిర్మాతలు సమాధానాలు ఇచ్చారు.
అయితే ఓ రిపోర్టర్ పుష్ప 2 సినిమా టికెట్ రేట్ల పెంపు విషయం గురించి పలు ప్రశ్నలు అడిగారు. దీంతో నిర్మాత నవీన్ యెర్నేని స్పందిస్తూ కల్కి సినిమా రిలీజ్ సమయంలో డిప్యూటీ సీఎం మరియు హీరో పవన్ కళ్యాణ్ ని టికెట్ ధరలు పెంచే విషయంలో కలిశామని దీంతో పవన్ బడ్జెట్ ని బట్టి పెంచుకోవచ్చని చెప్పారని తెలిపాడు. అలాగే ఒక్కో టికెట్ పై రూ.100 కి మించి పెంచుకోవచ్చని కూడా సూచించినట్లు నిర్మాత నవీన్ చెప్పుకొచ్చాడు. దీన్నిబట్టి చూస్తే పుష్ప 2 సినిమా టికెట్ ధరలు కూడా సింగిల్ స్క్రీన్ రూ.250, మల్టీప్లెక్స్ లలో రూ.375 కి పైగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ALSO READ | బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన పుష్ప 2 టీం.. ఒకరోజు ముందుగానే..
ఇక పుష్ప 2 : ది రూల్ చిత్రంలో హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తుండగా, హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తోంది. అనసూయ, అజయ్, ఫహాద్ ఫజిల్, శ్రీతేజ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
అయితే మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రమైన పుష్ప 2 రిలీజ్ కి ముందే దాదాపుగా రూ.1000 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. గతంలో పుష్ప 2 డిసెంబర్ 6న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. కానీ లాంగ్ వీకెండ్ ఉండటంతో అనుకున్న డేట్ కంటే ఒక రోజు ముందుగానే డిసెంబర్ 5న పుష్ప 2 ని థియేటర్లలలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో బన్నీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.