
పాడుతా తీయగా సింగర్ ప్రవస్తి ఆరోపణలు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారాయి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, రైటర్ చంద్రబోస్ పాడుతా తీయగా ప్రోగ్రామ్లో తనను వేధించారని వీడియో రిలీజ్ చేసి ఆరోపించింది.
అంతేకాకుండా ప్రొడక్షన్ హౌస్ జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ గురించి కూడా సంచలన ఆరోపణలు చేసింది. కాస్ట్యూమ్స్ విషయంలో వాళ్ళు చీర బొడ్డికిందకి కట్టుకోవాలని, ఎక్స్పోజింగ్ చేయాలని ఫోర్స్ చేసే వాళ్ళు. నేను తమిళంలో ఎన్నో పాటలు పాడా.. కానీ ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని ఆరోపించింది.
ఈ క్రమంలో జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత ప్రవీణ కడియాల క్లారిటీ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణల విషయాలను ఒక్కొక్కటిగా వివరంగా వివరిస్తూ మాట్లాడింది.
"పాటకు తగ్గట్టే కంటెస్టెంట్లకు తాను డ్రెస్సెస్ డిజైన్ చేయిస్తానని, బాడీ షేమింగ్‌పై తానెప్పుడూ మాట్లాడలేదని చెప్పింది. షోలో పాల్గొనేవారి దుస్తుల ఎంపిక కేవలం ఎంచుకున్న పాట ఆధారంగానే జరుగుతుందని, మనిషిని బట్టి ఎప్పుడూ దుస్తులు రూపొందించలేదని తెలిపింది. అయితే, ‘మీ బాడీకి ఏ డ్రెస్సూ సరిపోదు’ అని కాస్ట్యూమర్ అన్నారని వీడియోలో చెప్పారు కదా.. 'అలా అనడం తప్పే'. కానీ, మీరు అప్పుడే ఈ విషయాన్ని నాకు గానీ, షో డైరెక్టర్‌కు గానీ చెప్పాలి. డ్రెస్సు అలా వేసుకో, ఇలా వేసుకో అని నేనెప్పుడూ చెప్పలేదని, అంతా ఎలిమినేషన్ అయిపోయాక ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని' ప్రవీణ అన్నారు.
షో నియమాలను గురించి మాట్లాడుతూ.. 'జడ్జిమెంట్‌ను మేం గౌరవిస్తాం' అనే పాయింట్ అగ్రిమెంట్ పేపర్స్లో ఉంటుంది. మీరు సైన్ చేసేటప్పుడు చూసి ఉంటే బాగుండేది. జడ్జిల మార్కులను బట్టే అందరం ఫాలో అవుతాం. వారి తీర్పును అందరం గౌరవించాలి. ఇలా జడ్జిల మీద ఆమె ఆరోపణలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇలాంటి అపోహలన్నీ పక్కన పెట్టి, మీరు జీవితంలో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా ప్రవస్తి' అంటూ ప్రవీణ వీడియో ద్వారా చెప్పుకొచ్చింది.
సింగర్ సునీత:
ప్రవస్తి చేసిన ఆరోపణలపై సింగర్ సునీత సైతం స్పందించింది. ఈ మేరకు ప్రవస్తి వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండిస్తూ ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో రిలీజ్ చేసింది.
సింగర్ సునీత మాట్లాడుతూ.. ‘‘ప్రవస్తి.. నిన్ను బాల్యంలో పాడుతా తీయగా జడ్జెస్ ముద్దుచేసినట్టే, నేనూ కూడా ముద్దుచేశా. ఈ వయసులో కూడా అలా చేస్తే బాగుండదు కదా. చిన్నప్పుడు మంచిగా పాడినప్పుడు ఎంతో ప్రశంచించే వాళ్ళం. అలా షోలో ఎవరు బాగా పాడినా మేం లీనమై భావోద్వేగంతో ఏడ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయా ఎపిసోడ్స్ నువ్వు చూడలేదనుకుంటా.
అలాంటి ప్రవస్తి ఇంతటి పెద్దదైపోయి మా గురించి చర్చించే స్థాయికి వెళ్లినందుకు అసంతృప్తిగా ఉంది. నువ్వు ఎన్నో పోటీల్లో పాల్గొన్నావు కదా ప్రాసెస్ ఎలా ఉంటుందో నీకు తెలియదా? కొన్ని ఛానళ్లకు కొన్ని పాటలకే హక్కులుంటాయి. ఆడియన్స్‌కు ఇలా చెబితే అన్ని విషయాలు చెప్పు. అప్పుడు నిజంగా నేను సంతోషిస్తా. అలాగే నువ్వు చాలా సార్లు అప్సెట్ లో ఉన్నప్పుడు, దగ్గరికొచ్చి ఎంతో ప్రోత్సహించానాని’’అని సునీత అన్నారు.
కీరవాణి, సునీత, చంద్రబోస్లపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు
— Ramesh Pammy (@rameshpammy) April 21, 2025
👉‘పాడుతాతీయగా’ షోలో జడ్జీలు వివక్ష చూపిస్తున్నారు.
👉బాడీ షేమింగ్‌తో పాటు పెళ్లిళ్లలో పాడానంటూ అవమానించారు.
👉బొడ్డు కిందకి చీర కొట్టుకోవాలని, ఎక్స్పోజింగ్ చేయాలని ప్రొడక్షన్ టీమ్ నుంచి ఒత్తిడులు
- సింగర్ ప్రవస్తి… pic.twitter.com/uWIfIgr25q