బచ్చలమల్లి చూశాక నరేష్​ 2.0 అంటారు : రాజేష్ దండా

బచ్చలమల్లి చూశాక నరేష్​ 2.0 అంటారు : రాజేష్ దండా

రామ్ చరణ్‌‌‌‌కి ‘రంగస్థలం’ ఎలానో అల్లరి నరేష్‌‌‌‌కి ‘బచ్చలమల్లి’ సినిమా అలాంటిదని నిర్మాత రాజేష్ దండా అన్నారు. నరేష్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజేష్​ దండా మాట్లాడుతూ ‘ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. 1980 బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఉంటుంది. లైఫ్‌‌‌‌లో తప్పులు చేయొచ్చు.  కానీ సరిదిద్దుకోలేని తప్పులు చేస్తే ఎలా ఉంటుందో ఇందులో చూపించాం. ఇది క్యారెక్టర్ డ్రివెన్ సినిమా. మూర్ఖత్వం బోర్డర్ దాటేసిన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో నరేష్ అద్భుతంగా నటించారు.

సినిమా చూసి ఇది నరేష్ 2.0 అని ఫీల్ అవుతారు.  క్యారెక్టరైజేషన్, లవ్ స్టోరీ, ఎమోషన్స్.. ఇవన్నీ ప్రేక్షకులకు   కనెక్ట్ అవుతాయి. ఇందులో అమృత అయ్యర్‌‌‌‌‌‌‌‌ది పెర్ఫార్మెన్స్  ఓరియెంటెడ్ క్యారెక్టర్. మెమొరబుల్‌‌‌‌గా ఉంటుంది. డైరెక్టర్ సుబ్బు చాలా కసితో ఈ సినిమా  చేశాడు. మళ్ళీ మళ్ళీ తనతో వర్క్ చేయాలని ఉంది. అలాగే  డిఓపి రిచర్డ్ ఎం నాథన్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు. ఫైట్ మాస్టర్ పృథ్వీ గూస్ బంప్స్ తెప్పించేలా యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. నరేష్ గారి ఫైట్స్ చూసి ఆడియెన్స్ సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ అవుతారు.

విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ హైలైట్‌‌‌‌గా నిలుస్తుంది. బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోర్‌‌‌‌‌‌‌‌తో నెక్స్ట్ లెవల్‌‌‌‌కి తీసుకెళ్ళారు. ఇక నరేష్ గారితో వరుస సీరియస్ ఫిల్మ్స్ చేసిన నేను.. ఆయనతో ఓ కామెడీ సినిమా  చేసేందుకు ప్లాన్ చేస్తున్నా. ప్రస్తుతం  సందీప్ కిషన్‌‌‌‌తో ‘మజాకా’ చేస్తున్నాం.  అలాగే కిరణ్ అబ్బవరం సినిమా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది’ అని చెప్పారు.