
గత పదేళ్ల (2015) నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్స్ అంటే మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers) అనే చెప్పాలి. నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి ఈ సంస్థను స్థాపించారు.
ప్రెజెంట్ వాళ్ళ సినిమాల లైనప్ చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ అందరితోను వీళ్ళు సినిమాలు చేస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కేవలం తెలుగులోనే కాదు తమిళ, హిందీ మార్కెట్లో కూడా సూపర్ ప్రాజెక్ట్స్ను సెట్ చేస్తున్నారు.
2024 ఏడాది చివర్లో అల్లు అర్జున్ తో పుష్ప 2 తీసి టాక్ అఫ్ ది వరల్డ్ సినిమాగా నిలిపారు. దాదాపు రూ.1875కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సక్సెస్ ఫుల్ సంస్థగా మైత్రి మూవీ మేకర్స్ నిలిచారు.
లేటెస్ట్గా ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్తో మైత్రి మేకర్స్ భారీ సక్సెస్ను అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా రూ.100కోట్ల వసూళ్లను సాధించి మైత్రి ఖాతాలో హిట్ మూవీగా నిలిచింది. నేడు మార్చి 3న 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమా సక్సెస్ మీట్ గ్రాండ్గా జరిగింది.
ఈ కార్యక్రమంలో నిర్మాత రవిశంకర్ తాజాగా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ప్రస్తుతం మైత్రి మేకర్స్.. 'నీల్-ఎన్టీఆర్' కాంబోలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అప్డేట్ గురించి మీడియా అడగ్గా.. అంచనాలు పెంచేదిశగా నిర్మాత రవిశంకర్ మాట్లాడి ఎన్టీఆర్ ఫ్యాన్స్లో జోష్ నింపాడు.
Also Read :- సైలెంట్ గా వచ్చి రూ.100 కోట్లు కొట్టిన డ్రాగన్
పుష్ప2 సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయని, ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీపై అంచనాలు ఎలా ఉన్నాయనే ప్రశ్న నిర్మాత రవిశంకర్‌కు ఎదురైంది. ఈ ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ.. “ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే సినిమా ఇండియాలో ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో యూనిక్ స్క్రిప్ట్ అది. దానికి ఆకాశమే హద్దు. ఆ సినిమాపై మేం చాలా నమ్మకంతో ఉన్నాం. అది ఎంత కలెక్షన్లు కలెక్ట్ చేస్తుందనేది ఎవరికీ తెలియదు. మీరు అంచనాలు వేసిన దానికంటే ఎక్కువే చేస్తుంది” అని మాట్లాడి భారీ హైప్ ఇచ్చేశారు.
#NTRNeel will be beyond all your expectations 🔥
— Mythri Movie Distributors LLP (@MythriRelease) March 3, 2025
A never seen before script in Indian Cinema 💥💥 pic.twitter.com/OrOwUSO0aX
అలాగే సినిమాను త్వరగా పూర్తి చేసి అనుకున్న టైంలోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ నెలలోనే ఎన్టీఆర్ సెట్‌లో జాయిన్ అవనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓల్డ్ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ స్పెషల్ సెట్‌ను రెడీ చేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ఇకపోతే.. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడట. ఇందులో హీరోయిన్‌గా రుక్మిణీ వసంత్‌ను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ రూపొందించనున్న ఈ మూవీ సైతం రెండు భాగాలుగా వస్తుందనే టాక్ వినిపిస్తోంది.