
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత ఎం.శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి భార్య వరలక్ష్మి(62) బుధవారం హైదరాబాద్‌లో కన్ను మూశారు. కొన్నేళ్ల క్రితం వరలక్ష్మి క్యాన్సర్ భారిన పడ్డారు. అందుకు సంబంధించి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ వరలక్ష్మి నిన్న అర్ధరాత్రి మరణించారు. ఆమె అంత్యక్రియలు గురువారం (ఆగస్ట్ 8న) నిర్వహిస్తామని శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు.
శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి భార్య వరలక్ష్మి ఉమ్మడి మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తెలలో ఒకరు. ప్రస్తుత డోన్ టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి స్వయానా చెల్లెలు. కాగా వరలక్ష్మి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు, పలు రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు.
శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా గుర్తింపు పొందారు. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, అరుంధతి వంటి సినిమాలను నిర్మించారు.
అంతేకాకుండా మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ పై ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ ప్రోగ్రాం నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఢీ డాన్స్ జోడి షో కి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా జీన్స్, అదుర్స్ , క్యాష్ , స్టార్ మహిళ వంటి కార్యక్రమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.కాగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.