పవన్, మహేష్ సినిమాలతో రూ.100 కోట్లు నష్టపోయిన ప్రొడ్యూసర్... రాద్ధాంతం చేసుకోకండంటూ బండ్ల గణేష్ ట్వీట్..

పవన్, మహేష్ సినిమాలతో రూ.100 కోట్లు నష్టపోయిన ప్రొడ్యూసర్... రాద్ధాంతం చేసుకోకండంటూ బండ్ల గణేష్ ట్వీట్..

టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత శింగనమల రమేష్ బాబు ఇటీవలే ఓ ప్రెస్ మీట్ లో పాల్గొని పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ తో తీసిన కొమరం పులి, మహేష్ తో తెరకెక్కించిన ఖలేజా సినిమాలవల్ల తీవ్రమైన నష్టాలు ఎదుర్కున్నానని తెలిపాడు. అనుకున్న సమయంకంటే షూటింగ్ ఆలస్యం కావడం, కాల్ షీట్లు లేకపోవడం, అలాగే సినిమా రిలీజ్ తర్వాత నెగిటివ్ టాక్ రావడంతో ఈ రెండు సినిమాల కారణంగా దాదాపుగా రూ.100 కోట్లు నష్టపోయానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

ఇక తాను సినిమాలు నిర్మించే సమయంలో 3,4 ఏళ్ళు షూటింగ్స్ చేసే ఛాన్సెస్ తక్కువగా ఉండేవని దీంతో సినిమాలు త్వరగా కంప్లీట్ చేసి అనుకున్న సమయానికి రిలీజ్ చేసేవాళ్ళమని తెలిపాడు. కానీ తన దురదృష్టం కారణంగా ఈ పులి, ఖలేజా సినిమాలు 3 ఏళ్ళకి మించి షూటింగ్ చేశామని, దీంతో ప్రొడక్షన్ మెయింటెనెన్స్, జీత భత్యాలు, బడ్జెట్ కోసం తెచ్చిన డబ్బుకి వడ్డీలు ఇవన్నీ కూడా పెరిగిపోయి నష్టాలు చవిచూసానని చెప్పుకొచ్చాడు. ఇంత పెద్దమొత్తంలో నష్టం వచ్చినప్పటికీ ఒక్క హీరో కూడా కనీసం రూపాయి కూడా సహాయం చెయ్యలేదని ఎమోషనల్ అయ్యాడు.

ALSO READ | SSMB29: రాజమౌళి మూవీలో చోప్రా రోల్ ఇదే.. పృథ్వీరాజ్ స్థానంలో మరో స్టార్ నటుడు.. క్రేజీ అప్డేట్స్ ఇవే!

అయితే ఈ విషయంపై ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇందులో భాగంగా"సింగనమల రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు.  మీ కోసం  పవన్ కళ్యాణ్  గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు, ప్రత్యక్ష సాక్షి నేను. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు." అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశాడు.