మాట ఇవ్వడం ఎంత గొప్పో..ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంతకంటే గొప్ప. గతంలో ఇచ్చిన మాట దైవంలా భావించి నిరూపించుకున్నాడు బేబీ మూవీ నిర్మాత, పవన్ కల్యాణ్ వీరాభిమాని SKN (శ్రీనివాస కుమార్).వివరాల్లోకి వెళితే..
ఏపీ ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ గెలిస్తే..తన భర్త ఆటో నడపగా వచ్చిన డబ్బులతో ఊరంతా పార్టీ ఇస్తానని మరియమ్మ అనే మహిళ హామీ ఇచ్చింది.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో..ఆ విషయం SKN దృష్టికి వచ్చింది.పవన్ కల్యాణ్ గెలిస్తే మరియమ్మకు తన డబ్బులతో ఆటో కొనిస్తానని మాటిచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం పిఠాపురం వెళ్లిన ఎస్కేయన్..తాజాగా SKN పిఠాపురానికి చెందిన మరియమ్మ మహిళకు ఆటో కొని బహుమతిగా ఇచ్చారు. మరియమ్మకు ఆటో కొని బహుమతిగా ఇవ్వడంతో ఆ కుటుంబంలో ఉప్పొంగిన ఆనందం వర్ణించలేనిది.
ఇదే విషయాన్ని SKN సోషల్ మీడియాలో ఆటో ఫొటోస్ షేర్ చేస్తూ.."నా హీరో,అభిమాన నాయకుడి పట్ల మరియమ్మ చూపించిన స్వచ్ఛత,నిజమైన ప్రేమ కోసం మరియమ్మ గారి కుటుంబానికి..మా నాయకుడి పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమకు ఆటోను బహుమతిగా ఇచ్చాను.వారి మనవడు దానిని నడిపి కుటుంబాన్ని చూసుకుంటాడు.వారి సంతోషకరమైన కళ్లను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది.మా నాయకుడి ఫాలోవర్లు ఎప్పుడూ ఆయనను గర్వపడేలా చేస్తారు"అంటూ పోస్ట్ పెట్టారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో SKN ఆటోకు రిబ్బన్ కట్ చేసి మరియమ్మతో కలిసి ఆటోలో ప్రయాణించారు.ఎస్కేయన్ తన మాట నిలుపుకోవడంతో జనసేన కార్యకర్తలు, పవన్ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. నిర్మాత SKN ఇదివరకు చాలా సమాజ సేవలలో తన వంతు బాధ్యతను నిరూపించుకున్నాడు.
మెగాస్టార్ అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నిర్మాతగా SKN..కెరీర్ మొదట్లో కొన్ని సినిమాలకు డిస్ట్రీబ్యూటర్ గా వర్క్ చేశారు.ఇక ఆ తర్వాత అల్లు అరవింద్ సహకారంతో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
విజయ్ దేవరకొండతో కలిసి టాక్సీవాలా,కలర్ ఫోటో,ప్రతి రోజు పండుగే, బేబీ మూవీస్ ను నిర్మించాడు.ఆనంద్ దేవరకొండతో తీసిన బేబీ మూవీ మంచి సక్సెస్ ను ఇచ్చింది.దీంతో స్టార్ ప్రొడ్యూసర్గా మారి ప్రస్తుతం పలు సినిమాలను నిర్మిస్తున్నాడు.
And I did as I said
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) July 11, 2024
Gifted an auto to mariyamma gari family for their pure love about our Leader. Their grand son gonna drive it and take care of their family
Very happy to see their happiest eyes ,
More power to our leader @PawanKalyan garu , his fans followers always ll make… https://t.co/8T3ED24qAN pic.twitter.com/9OE7Nmfp4F