తెలుగు హీరోయిన్స్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత... ఇంకో 25మంది అమ్మాయిలను...

తెలుగు హీరోయిన్స్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత... ఇంకో 25మంది అమ్మాయిలను...

టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ తెలుగు అమ్మాయిలకి ఇండస్ట్రీలో అవకాశాలు ఇచ్చే విషయంపై మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు ఇస్తే ఏం జరుగుతుందో తెలిసిందని మాట్లాడుతూ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. 

దీంతో ఈ విషయంపై నిర్మాత శ్రీనివాస్ కుమార్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇందులో భాగంగా ఓ వీడియోని షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఈవెంట్ లో తెలుగమ్మాయిల ఆఫర్ల విషయంలో తాను కావాలని అలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదని, ఎదో ఫన్నీ తరహాలో అలా మాట్లాడానని అంతేతప్ప అందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశాడు. ఇప్పటివరకూ తాను ఎక్కువమంది తెలుగు అమ్మాయిలని ఇండస్ట్రీకి పరిచయం చేశానని ఇందులో ఈషా రెబ్బ, వైష్ణవి చైతన్య, మానస,  ప్రియాంక జవాల్కర్, రేష్మ,ఆనంది, ఐశ్వర్య, ఖుషిత తదితరులని హీరోయిన్లుగా పరిచయం చేశానని చెప్పుకోచ్చాడు.

తాను నిర్మిస్తున్న కొత్త సినిమాలో మరో ముగ్గురు తెలుగు అమ్మాయిలని హీరోయిన్, ఆర్ట్ డైరెక్టర్, ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పరిచయం చెయ్యబోతున్నానని తెలిపాడు. అంతేకాకుండా హీరోయిన్లుగా మాత్రమే కాకుండా సినిమాకి సంబందించిన ప్రొడక్షన్, ఆర్ట్, కొరియోగ్రాఫర్ గా వివిధ డిపార్ట్ మెంట్స్ లో 25మంది తెలుగు అమ్మాయిలని పరిచయం చెయ్యాలనేది తన లక్ష్యం అని పేర్కొన్నాడు. కాబట్టి ఇకనైనా తానూ సరదాగా చెప్పిన మాటలని వక్రీకరించడం మానేసి మరింత కాంట్రవర్సీ చెయ్యద్దని కోరాడు.