
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలో కేవలం రూ.40 కకోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా దాదాపుగా 350 కోట్లు(గ్రాస్) కలెక్ట్ చేసింది. దీంతో ప్రశాంత్ వర్మ ఏకంగా నందమూరి మోక్షజ్ఞ డెబ్యూట్ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు. ఈ సినిమాని ప్రముఖ సినీ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. దీంతో ఇటీవలే ఈ సినిమా లాంచ్ డేట్ ని ప్రకటిస్తూ ముహూర్తం కూడా ఖరారు చేసారు. కానీ ఏమైందోఏమో చివరి క్షణంలో లాంచింగ్ కార్యక్రమాలు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో ప్రొడ్యూసర్స్ రూ.30 లక్షలు నష్టం వచ్చినట్లు సమాచారం.
అయితే ఉన్నట్లుండి మోక్షజ్ఞ డెబ్యూ సినిమా ఆగిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇందులో ముఖ్యంగా మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా లేడని, ప్రశాంత్ వర్మ స్టోరీలో చేంజెస్ చెయ్యాలని చెప్పడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని ఇలా రకరకాలుగా గాసిప్స్ వినిపించాయి. దీంతో ఈ సినిమా ప్రొడ్యూసర్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించాడు.
ఇందులోభాగంగా మోక్షజ్ఞ డెబ్యూట్ సినిమాపై వినిపిస్తున్న రూమర్స్ లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టి పారేశాడు. అలాగే ఈ బిగ్ ప్రాజెక్ట్ నుంచి ప్రశాంత్ వర్మ తప్పుకున్నట్లు వినిపిస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని స్పష్టం చేశాడు. అలాగే డిసెంబర్ నెలలోనే ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉందని కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల వచ్చే ఏడాది జనవరిలో మొదలు పెట్టనున్నట్లు తెలిపాడు. సినిమా యూనిట్ కూడా జనవరిలో నందమూరి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నామని జస్ట్ వేయిట్ అండ్ సీ అన్నాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ అనందం వ్యక్తం చేస్తున్నారు.