
ఖైరతాబాద్, వెలుగు: ‘కుబేర’ టైటిల్ మాదని, శేఖర్‌కమ్ముల తన సినిమాకు కుబేర టైటిల్ ఎలా పెట్టుకుంటారని నిర్మాత కరిమకొండ నరేందర్ప్రశ్నించారు. 2023 నవంబర్ లో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్కౌన్సిల్లో ‘కుబేర’ టైటిల్‌ను తాను రిజిస్ట్రేషన్చేయించుకున్నట్లు తెలిపారు. న్యాయవాది రాజేశ్‌తో కలిసి నరేందర్శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు.
విరాట్ దర్శకత్వంలో కుబేర సినిమాను ఇప్పటికే 90 శాతం పూర్తి చేశామన్నారు. టైటిల్‌కు ముందు తన పేరును పెట్టుకుని శేఖర్‌కమ్ముల సినిమా తీస్తున్నారని, దాంతో తమకు ఎంతో నష్టం వస్తుందన్నారు. టైటిల్అయినా మార్చుకోవాలి లేదా నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తాము మొత్తం 5 భాషల్లో టైటిల్‌ను రిజిస్టర్చేశామన్నారు.