హైదరాబాద్ సిటీలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న హైడ్రాపై నిర్మాత సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రాతో ప్రకృతి వినాశం తగ్గుతుందన్నారు. పర్సనల్ గ్రీడ్ పెరిగినప్పుడే కబ్జాలు జరుగుతుంటాయి. ఇది ప్రకృతి వినాశానాకి దారి తీస్తుంది.. ఎన్ కన్వెన్షన్ కూలివేతపై స్పందించిన సురేష్ బాబు.. చట్టం తన పనితాను చేసుకుపోతుందన్నారు.
తాత్కాలికంగా హైడ్రా బాధితులకు బాధ ఉండొచ్చు.. కానీ హైడ్రాతో ప్రకృతికి వినాశనం తగ్గి ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. గురువారం (సెప్టెంబర్5న) వరద బాధితులకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన సురేష్ బాబు V6 తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.