హైలైట్ యాక్షన్

హైలైట్ యాక్షన్

విభిన్నమైన స్ర్కిప్ట్‌‌‌‌‌‌‌‌లను సెలక్ట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. శుక్రవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా తను నటిస్తున్న మూవీ నుంచి సరికొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మరో మూవీకి సంబంధించి క్రేజీ అప్‌‌‌‌‌‌‌‌డేట్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం నుంచి కళ్యాణ్ రామ్  బ్రాండ్ న్యూ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేసి ఆయనకు బర్త్‌‌‌‌‌‌‌‌డే విషెస్ తెలియజేశారు. ఇందులో  ఆయన ఫెరోషియస్ అవతార్‌‌‌‌‌‌‌‌లో కనిపించాడు.

తన పిడికిలికి ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో, కుర్చీపై కూర్చున్న కళ్యాణ్ రామ్ తన చుట్టూ ఉన్న విలన్స్‌‌ ను ఇంటెన్స్‌‌‌‌‌‌‌‌గా చూస్తున్నట్లు పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ప్రెజెంట్ చేశారు.  ఈ సినిమాలో ఫైర్ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌ ఆర్ట్స్‌‌‌‌‌‌‌‌ బ్యానర్స్‌‌‌‌‌‌‌‌పై అశోక్‌‌‌‌‌‌‌‌ వర్ధన్‌‌‌‌‌‌‌‌ ముప్పా, సునీల్‌‌‌‌‌‌‌‌ బలుసు ఈ  చిత్రాన్ని  నిర్మిస్తున్నారు.

మరోవైపు ‘బింబిసార’కి ప్రీక్వెల్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించారు.  ‘బింబిసార కన్నా యుగాల ముందు త్రిగర్తలను ఏలిన లెజెండ్‌‌‌‌‌‌‌‌ని చూడడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ దీన్ని అనౌన్స్  చేస్తూ భారీ ఏనుగుతో కాన్సెప్ట్‌‌ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేయడం  క్యూరియాసిటీని పెంచుతోంది. అనిల్‌‌‌‌‌‌‌‌ పాదూరి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే సెట్స్‌‌‌‌‌‌‌‌కు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నామని మేకర్స్ చెప్పారు.