నందమూరి జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి దర్శక నిర్మాతగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగమ్మాయి వీణారావును హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. శనివారం వీణారావు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిర్మాతలు స్వప్న దత్, సుప్రియ యార్లగడ్డ లాంచ్ చేసి వీణకు బెస్ట్ విషెస్ చెప్పారు. మోడ్రన్ అవుట్ ఫిట్స్‌లో వీణారావు లుక్ ఆకట్టుకుంది. గత 18 నెలలుగా అన్ని ముఖ్య విభాగాల్లో శిక్షణ పొందానని, అలనాటి నటి భానుమతి స్ఫూర్తితో అన్నివర్గాల ప్రేక్షకులను రంజింపచేస్తానని వీణారావు వీడియో ద్వారా చెప్పింది.
ఈ సందర్భంగా వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ ‘మహిళా శక్తులుగా ఎదిగిన సుప్రియ, స్వప్న చేతుల మీదుగా మా మూవీ హీరోయిన్ ఫస్ట్ లుక్ లాంచ్ అవడం హ్యాపీ. ఇప్పటికే మా హీరో ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వీణారావుకి కూడా వరల్డ్ వైడ్ గా మంచి ప్రశంసలు రావాలని కోరుకుంటున్నా. వీణా మన తెలుగమ్మాయి. మంచి కూచిపూడి డ్యాన్సర్. అందాల రాశి. తనకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. యలమంచిలి గీత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం, చంద్రబోస్ లిరిక్స్, సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.