పూలు అంటే లక్ష్మీ స్వరూపం.. పువ్వు కింద కనపడితే తొక్కకుండా పక్కనుంచి వెళతాం.. లేదంటే తీసి కళ్లకద్దుకొని పక్కనే చెట్టు మొదట్లో వేస్తాం. అదే దేవాలయంలో అర్చించిన పూలను దగ్గరలోని నదిలో కలుపుతాం ఇది.. హిందూ సాంప్రదాయం. జనవరి 22 రామ జన్మభూమి అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో కొన్ని వేల టన్నుల కొద్దీ పూలు వాడారు. వీటన్నింటి నదిలో వేయాలన్నా చెట్ల వద్ద వేయాలన్నా సాధ్యపడే విషయం కాదు. మరి ఆ పూలను ఏంచేశారనుకుంటన్నారా... మరి ఆపూలు వృధాకాకుండా అయోధ్య మున్సిపాల్టీ అధికారులు ఏంచేస్తున్నారో తెలుసుకుందాం..
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక కోసం జనవరి 22 న ఉత్తరప్రదేశ్ నుంచి సుమారు పది టన్నుల పూలు తెప్పించి పూజలు చేశారు. ముఖ్యంగా బాలరాముడి గర్భాలయాన్ని అలకరించేందుకే చెన్నై నుంచి ఏకంగా 20 రకాల పూలను మూడువేల కిలోలు తెప్పించారు. ఈ భవ్య రామాలయాన్ని క్రిస్తానియం, గెర్బెరా, ఆర్కడ్లు, ప్రోమేథియం, బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ తదితర పూలతో ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. అలాగే బెంగళూరు, పూణే, లక్నో, ఢిల్లీ వంటి ఇతర నగరాల నుంచి కూడా ఈ కత్రువు కోసం పలు రకాల పూలను తెప్పించారు.
ఈ ప్రాణప్రతిష్ట క్రతవు ముగిసిన తదనంతరం అయోధ్య ధామ్‌లో అన్ని దేవాలయాలల్లోని సుమారు 9 మెట్రిక్ టన్నుల పుష్పాల వ్యర్థాలు వచ్చాయి. అయితే వీటన్నింటిని ఈ రీసైకిల్ చేయాలని భావిస్తున్నారు అధికారులు. ఈ పుష్పాలను రీసైకిల్ చేసి అగరుబత్తీలను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రతను కాపాడుకునేలా ఇలా వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్. అందులో భాగంగానే అయోధ్యధామ్‌లోని అన్ని దేవాలయాల్లో వినియోగించిన పువ్వులన్నింటిని ప్రాసెసింగ్ చేసి ధూప్ స్టిక్‌లు ఉత్పత్తి చేసే ఓ ప్రాజెక్టును కూడా ప్రారంభించింది అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్.
అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట క్రతువు కూడా ముగిసింది. ఇక ఆ తతంగంలో వినియోగించిన పువ్వులన్నింటితో కలిపి ఆ ప్రక్రియ కాస్త ఏకంగా 2.3 మెట్రిక్ టన్నులకు పెరిగింది. ప్రస్తుతం అయోధ్య మున్సిపాలిటి సిబ్బంది ఆ పువ్వులన్నింటిని ప్రాసెస్ చేస్ ధూప్ కర్రలను తయారు చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు మున్సిపాలిటి అధికారులు తెలిపారు.
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం జనవరి 22న అంగరంగ వైభవంగా జరిగింది. ఆ సమయంలో అయోధ్య రామ మందిరంతో పాటు నగరం ఎంతో సుందరంగా ముస్తాబయ్యింది. పూలతో చేసిన అలంకరణ చూస్తే రెండు కళ్లు చాలవు అన్నంత మనోహరంగా ఉంది. భవ్య రామాలయ ప్రారంభోత్సవం కోసం టన్నుల కొద్ది పుష్పాలను వివిధ రాష్ట్రాలను తెప్పించి మరీ ఉపయోగించారు. అయితే ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పూర్తైన తర్వాత ఆ పూలు వృధాగా కాకూడదని అయోధ్య మున్సిపాలిటీ అధికారులు నిర్ణయించారు.