గణతంత్ర దినోత్సవ కోసం ఐదువేల జాతీయ జెండాలు

రిపబ్లిక్ డే వేడుకల కోసం అస్సాం ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డులో జాతీయ జెండాలు తయారు చేస్తున్నారు. ఈ ఏడాది 5 వేల 4 వందల జాతీయ జెండాలు తయారు చేస్తున్నామన్నారు ఖాదీ బోర్డు అదనపు ఎగ్జిక్యూటివ్. గతేడాదితో పోలిస్తే... ఈసారి ఎక్కువ జెండాలు తయారు చేస్తున్నామన్నారు. 11 లక్షల 20 వేల విలువైన జెండాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. కొవిడ్ వల్ల కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కార్మికులు రాక గతేడాది 2 వేల జెండాలే తయారు చేసినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

బ్రీత్ ఎనలైజర్ యంత్రాలు రిపేర్ చేయాలి

పొగమంచుతో ఢిల్లీలో పలు రైళ్లు రద్దు