
ఆస్తి తగాదా అన్నదమ్ముళ్ల మధ్య చిచ్చుపెట్టింది. అంతే స్థలవివాదం రక్తబంధాన్ని సైతం బద్ధ శతృత్వంగా మార్చింది. జనగామ జిల్లాలో ఆస్తి కోసం అన్నదమ్ములు తన్నుకున్నారు. కంట్లో కారం చల్లుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే
స్టేషన్ ఘన్ పూర్ లో నివాసముండే గట్టు కుమారస్వామి, రమేష్, కృష్ణ అనే అన్నదమ్ముల మధ్య కొంత కాలంగా ఆస్తి వివాదం నెలకొంది. చిలికి చిలికి గాలివానగా మారడంతో.. అన్న కుమారస్వామిపై తన ఇద్దరు తమ్ముళ్లు రమేష్, కృష్ణ దాడి చేశారు. కుమారస్వామి కంట్లో కారం చల్లారు. ప్రస్తుతం వీరి ఆస్తి తగాదా విషయం కోర్టులో కేసు కొనసాగుతుంది. అయితే ఆస్తి వివాదంలో రాజీపడాలని అన్న కుమారస్వామిపై తమ్ముళ్లు ఒత్తిడి తెచ్చారు. దీనికి అతను ఒప్పుకోకపోవడంతో తమ్ముళ్లు దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి.