విద్యాశాఖ నియామకాలపై సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. ఉన్నత విద్యా మండలి పదవుల భర్తీ చేసింది ప్రభుత్వం. ఉన్నత విద్యామండలి ఛైర్మన్, వైస్ చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఉన్నత విద్యామండలి చైర్మన్ గా ప్రొ.బాలకిష్టా రెడ్డి, వైస్ ఛైర్మన్ గా ఇటిక్యాల పురుషోత్తంని నియమించింది. ప్రస్తుతం ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ గా ఉన్న లింబాద్రిని రిలీవ్ చేసింది.
అలాగే రెండు యూనివర్సిటీలకు ఇన్చార్జీ విసీలను నియమించింది. బాసర త్రిబుల్ ఐటీ వీసీగా గోవర్ధన్, తెలుగు యూనివర్సిటీ ఇన్చార్జీ వీసీగా ప్రొఫెసర్ దనావత్ సూర్య, అంబేద్కర్ మినహా అన్ని వర్సిటీల్లో ఇప్పటికే సెర్చ్ కమిటీల భేటీలు పూర్తయ్యాయి. సామాజిక వర్గాల వారీగా వీసీ నియామకంపై కసరత్తు జరుగుతోంది.