ముషీరాబాద్, వెలుగు: పితృస్వామ్య భావజాల వ్యతిరేక పోరాటంలో కలిసివచ్చే పురుషులను భాగస్వామ్యం చేయాలని ప్రొఫెసర్ శాంతా సిన్హా పిలుపునిచ్చారు. ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర మహాసభలు ఆదివారం రెండో రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కొనసాగాయి. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా గొంతు పెంచాలన్నారు. ప్రొ.రమా మేలుకోటే మాట్లాడుతూ.. కులం, మతం పేరుతో హింస పెరిగిందని, మతాన్ని ఒక బిజినెస్ గా తయారు చేశారని విమర్శించారు.
ఉన్నత విద్యలో మహిళల సంఖ్య పెరుగుతున్నా.. ఉద్యోగాల్లో మాత్రం ప్రాతినిధ్యం పెరగకపోవడం బాధాకరమని ప్రొ. మేరీ జాన్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఝాన్సీ, మంగ, అనసూయ, సరిత, జ్యోతి, సీత, జానకి, గీత, సంధ్య, అంబిక తదితరులు పాల్గొన్నారు.