కేయూ రిజిస్ట్రార్​గా ప్రొఫెసర్​ రాంచంద్రం

కేయూ రిజిస్ట్రార్​గా ప్రొఫెసర్​ రాంచంద్రం

హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీ నూతన రిజిస్ట్రార్​గా ప్రొఫెసర్​ వి.రాంచంద్రం నియమితులయ్యారు. వీసీ ప్రొ.కె.ప్రతాప్​రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్​గా రాంచంద్రంను నియమిస్తూ అడ్మినిస్ట్రేషన్​ ఏఆర్​సీహెచ్​ప్రణయ్​కుమార్​శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్నిరోజులు రిజిస్ట్రార్​గా కొనసాగిన ప్రొ.పి.మల్లారెడ్డి పదవీకాలం ముగియగా, ప్రొ.వి.రాంచంద్రానికి బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఎస్​డీఎల్​సీఈ డైరెక్టర్​గా, సైకాలజీ హెచ్​వోడీగా, కాలేజీ డెవలప్​మెంట్​ కౌన్సిల్​ డీన్​గా, యూనివర్సిటీ విద్యాకళాశాల ప్రిన్సిపల్​గా కొనసాగుతున్నారు.

 దాదాపు 33 ఏండ్ల బోధనా, పరిశోధన అనుభవం కలిగిన ప్రొ.రాంచంద్రం నేతృత్వంలో ఆరుగురు రీసెర్చ్​స్కాలర్లు డాక్టరేట్​ పొందగా,  నలుగురు ఎంఫిల్​ పట్టా పొందారు. 47కు పైగా సెమినార్ లు, కాన్ఫరెన్స్ లకు హాజరయ్యారు. కాగా, నూతన రిజిస్ట్రార్​గా శుక్రవారం ప్రొ.వి.రాంచంద్రం బాధ్యతలు స్వీకరించగా, పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. 48 ఏండ్ల యూనివర్సిటీ చరిత్రలో రిజిస్ర్టార్​ పదవిని అధిష్టించిన తొలిదళితుడిగా ప్రొ.రామచంద్రం పేరుకెక్కింది.