రూ. 205 కోట్లు సేకరించిన ప్రోఫెక్టస్ క్యాపిటల్

రూ. 205 కోట్లు సేకరించిన ప్రోఫెక్టస్ క్యాపిటల్

హైదరాబాద్, వెలుగు : సూక్ష్మ, చిన్న  మధ్యతరహా పరిశ్రమలపై ( ఎంఎస్ఎంఈలు) దృష్టి సారించిన నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ప్రోఫెక్టస్ క్యాపిటల్ ప్రైవేట్ లిమిటెడ్,  ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ)కు నాన్-–కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీడీలు) జారీ చేయడం ద్వారా  25 మిలియన్ డాలర్లను (సుమారు రూ. 205 కోట్లు) సేకరించింది.  మనదేశంలో  ఎంఎస్ఎంఈలకు  ఆర్థిక సహాయం చేయడానికి ఐఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ ఈ  పెట్టుబడి పెట్టింది.

ఈ ఆదాయాన్ని గ్రీన్ అసెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం నిధులు సమకూర్చడానికి ఉపయోగిస్తారు. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీడీలను గ్రీన్ బాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా గుర్తించారు. ఇంటర్నేషనల్ క్యాపిటల్ మార్కెట్ అసోసియేషన్  గ్రీన్ బాండ్ సూత్రాలకు అనుగుణంగా ప్రోఫెక్టస్ గ్రీన్ బాండ్ ఫ్రేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేసింది.