- సర్కార్‌కు డాక్టర్స్ అసోసియేషన్ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: జనరల్ ట్రాన్స్‌ఫర్ల నుంచి కొంత మంది డాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా మినహాయింపు పొందారని ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ బి.బాబురావు మంగళవారం ఫిర్యాదు చేశారు. డాక్టర్ పల్లం ప్రవీణ్, డాక్టర్ బొంగు రమేశ్, డాక్టర్ లాలు ప్రసాద్ తదితరులు తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లమని చెప్పుకుని ట్రాన్స్‌ఫర్ల నుంచి మినహాయింపు పొందినట్లు వివరించారు.
ప్రభుత్వం ఇచ్చిన ట్రాన్స్‌ఫర్ల ఉత్తర్వుల (జీవో ఎంఎస్ నంబర్ 80) ప్రకారం వీరు మినహాయింపులకు అర్హులుకారని తన ఫిర్యాదులో వెల్లడించారు. పల్లం ప్రవీణ్ 19 ఏండ్లుగా, బొంగు రమేశ్ 17 ఏండ్లుగా, లాలు ప్రసాద్ 12 ఏండ్లుగా హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారని చెప్పారు. ఈ అంశంపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర, సీఎం రేవంత్ స్పందించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు.