కరీంనగర్ టౌన్,వెలుగు : ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో నిర్వహించనున్న యునెస్కో ఎడ్యూకేషన్ మీటింగ్‌కు ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ మల్లారెడ్డి ఎన్నికయ్యారు. ఆయన కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్, ఎగ్జామినేషన్ కంట్రోలర్ గా విధులు నిర్వహిస్తునారు.
తాష్కెంట్‌లో అక్టోబర్10,11వ తేదీల్లో నిర్వహించే ఎడ్యుకేషన్ మీటింగ్‌కు హాజరుకానున్నారు. మల్లారెడ్డి ఎంపికపై గురువారం ప్రిన్సిపాల్ డా.రామకృష్ణ, లెక్చరర్లు డా.కె. సురేందర్ రెడ్డి, డా.ఎ. శ్రీనివాస్,నర్సింహులు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజు, తదితరులు అభినందించారు.