ఇన్నోవేటీవ్ గా ఆలోచించిన ఓ ప్రొఫెసర్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ప్రాబ్లమ్ ను క్లియర్ చేయమని తన సోదరికి సూచించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కెమిస్ట్రీ మ్యాథ్స్ ప్రాబ్లమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అమెరికాకు చెందిన ప్రొఫెసర్ కెమ్ తన సోదరి ఎలిస్ మోర్గాన్ కు కెమిస్ట్రీ మ్యాథ్స్ ప్రాబ్లమ్ ను క్లియర్ చేయమని చెప్పింది. సాధారణంగా కెమిస్ట్రీ మ్యాథ్స్ ప్లాబ్లమ్ ను ఎవరైనా క్లియర్ చేస్తారు. కానీ ప్రొఫెసర్ కెమ్ ఇన్నోవేటీవ్ గా ఆలోచించడంతోనే చిక్కొచ్చిపడింది.
ప్రొఫెసర్ కెమ్ కు అమెరికన్ ప్రముఖ ర్యాపర్ నిక్కీ మినాజ్ అంటే చాలా ఇష్టం . ఆమెపై ఉన్న మక్కువతోనే నిక్కీ మినాజ్ పై కెమిస్ట్రీ మ్యాథ్స్ క్వశ్చన్ రెడీ చేసి తన సోదరి ఎలిస్ కు ఇచ్చింది. అయితే ఎలిస్ ఆ మ్యాథ్స్ ప్రాబ్లమ్ ను ఎలా క్లియర్ చేయాలో అర్ధంకాక హెల్ప్ చేయమంటూ
నిక్కీ మినాజ్ పై ప్రిపేర్ చేసిన కెమిస్ట్రీ మ్యథ్స్ క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎలిస్ కు హెల్ప్ చేసేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తుంటే మరికొందరు తమ ప్రొఫెసర్లు అడిగిన ప్రశ్నలు ఇలా ఉన్నాయంటూ సోషల్ మీడియాతో పంచుకున్నారు.