బషీర్ బాగ్, వెలుగు : ప్రకృతిని , ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. హైదర్గూడ ఎన్ఎస్ఎస్ లో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక నిర్వహించిన సమావేశంలో హరగోపాల్ పాల్గొని మాట్లాడారు. ఈ నెల 12న ఛత్తీస్ ఘడ్ ఆబూజ్ మడ్ లో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని ఆరోపించారు.
ఎన్కౌంటర్లు జరిగినప్పుడు వాస్తవాలను తెలుసుకొనేందుకు నిజనిర్దారణ కమిటీ నాయకులు వెళ్తే అనుమతించడం లేదని అన్నారు. తాము వెళ్తే ఎన్కౌంటర్లు అన్నీ బూటకమే అని తెలుతాయని , తమను అడ్డుకుంటున్నారన్నారు. ఆదివాసీ ప్రజలకు సంఘీభావంగా పౌర సమాజం అండగా నిలవాలని హరగోపాల్ విజ్ఞప్తి చేశారు.
125 జంక్షన్ల అభివృద్ధికి కావాల్సిన భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్ ఇతర సమస్యల పరిష్కారానికి అధికారులతో వేసిన కమిటీ చర్యలు తీసుకోవాలన్నారు. రూ.124.68 కోట్ల అంచనా వ్యయంతో 195 సుందరీకరణ పనులు చేపట్టగా, అందులో 28 పనులు పూర్తి అయినట్లు చెప్పారు. అసిస్టెంట్ ఇంజినీర్లు పృథ్వి, బాలాజీ, జోనల్ ఎస్ఈలు రత్నాకర్, మహేశ్ రెడ్డి, నిత్యానంద, శంకర్ నాయక్, చిన్నా రెడ్డి, ఈఈ పాల్గొన్నారు.