యూజీసీ కీలుబొమ్మలా మారింది: ప్రొఫెసర్ హరగోపాల్

యూజీసీ కీలుబొమ్మలా మారింది: ప్రొఫెసర్ హరగోపాల్

బషీర్ బాగ్, వెలుగు: యూనివర్సిటీ గ్రాంట్స్‌‌‌‌ కమిషన్‌‌‌‌ (యూజీసీ)ను కేంద్ర ప్రభుత్వం కీలుబొమ్మలా ఆడిస్తున్నదని ప్రొఫెసర్ హరగోపాల్, ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అధ్యక్షతన ‘యూజీసీ 2025 నిబంధనలు వర్సిటీల స్వయం ప్రతిపత్తిపై దాడి’ అనే అంశంపై ఆదివారం జాతీయ సదస్సు నిర్వహించారు. 

ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ హరగోపాల్,  ప్రొఫెసర్ కాశీం, అతిథులుగా ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు విరాజ్ దేవాంగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సిరంగరాజ్, ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షుడు రామకృష్ణ పాండ, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు ఎన్ఏ స్టాలిన్ పాల్గొని ప్రసంగించారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ తీసుకువచ్చిన యూజీసీ కొత్త మార్గదర్శకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​చేశారు. 

సంస్కరణల పేరుతో ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందన్నారు. పూర్తిగా గవర్నర్ చేతిలో వీసీల నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని, ఇది అత్యంత ప్రమాదకరమని తెలిపారు.