ముషీరాబాద్, వెలుగు: కౌలు రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పౌర హక్కుల సంఘం నాయకుడు, ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. 2011 చట్టం ప్రకారం కౌలు రైతులను గుర్తించాలని కోరారు. ఈ మేరకు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద పబ్లిక్ హియరింగ్ పేరిట ధర్నా నిర్వహించారు. ప్రొఫెసర్ హరగోపాల్, జోరీ, డాక్టర్ రుక్మిణి, సీనియర్జర్నలిస్ట్కె.శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా కౌలు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. కౌలు రైతులను గుర్తించి పథకాలు అందించకపోతే కేసీఆర్ కు, రేవంత్‌రెడ్డికి పెద్దగా తేడా ఉండదన్నారు. డాక్టర్ రుక్మిణిరావు, సంయుక్త కిసాన్ మోర్చా ప్రతినిధులు విస్సా కిరణ్ కుమార్, పశ పద్మ, టి.సాగర్, బి.కొండల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పంట బీమా, పంట నష్టపరిహారం, రైతు బీమా, బ్యాంకు రుణాలు అందించాలని కోరారు. రైతు భరోసా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు.