ఓయూ స్టూడెంట్లు హక్కులను హరించొద్దు : ​ హరగోపాల్

ఓయూ స్టూడెంట్లు హక్కులను హరించొద్దు : ​ హరగోపాల్
  •  ప్రొఫెసర్​ హరగోపాల్ 

ఖైరతాబాద్, వెలుగు: ఓయూ క్యాంపస్​లో ఆందోళనలు, నిరసనలను నిషేధిస్తూ యాజమాన్యం జారీ చేసిన సర్క్యులర్​ను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రొఫెసర్​హరగోపాల్ డిమాండ్​చేశారు. ‘ ఉద్యమాల ఉనికి పట్టు.. ఉస్మానియాపై ఉక్కుపాదమా?’ అనే అంశంపై శనివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

 ప్రొఫెసర్​ హరగోపాల్​పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల హక్కులను హరించవద్దని కోరారు. వీసీ స్పందించి సర్క్యులర్​వెనక్కి తీసుకోవాలన్నారు. నందిని సిధారెడ్డి, సీనియర్​ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, శ్రీనివాస్, అల్లం నారాయణ, కవ్వాల లక్ష్మారెడ్డి, వేణు, పరిటాల విష్ణువర్థన్​రావు పాల్గొని మాట్లాడారు.