గద్వాల, వెలుగు: ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఎన్నికలు ఒకటే కాదని, ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను సంఘటితంగా వ్యక్తీకరించడమే ప్రజాస్వామ్యమని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు.
ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ బిల్డింగ్ లో ‘ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఏమిటి? ఎలా? ’ అనే అంశంపై పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని వక్రీకరిస్తే ఫాసిజం విజృంభిస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ ప్రయత్నించాలని సూచించారు. జిల్లా కన్వీనర్ ఎండీ ఇక్బాల్ పాషా, హనుమంతు, రాఘవాచారి పాల్గొన్నారు.