కేసీఆర్​కు ఓటుతో సమాధానం చెప్పాలె : ప్రొఫెసర్ ​హరగోపాల్​

కూసుమంచి, వెలుగు: రాష్ర్టంలో సహజ వనరులను కొల్లగొడుతూ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న కేసీఆర్​ ప్రభుత్వాన్ని ఓడగొట్టాలని టీపీజేఏసీ కన్వీనర్ ​ప్రొఫెసర్ హర గోపాల్​ పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ఎన్డీ పార్టీ ఆఫీస్​లో ఆయన మాట్లాడారు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడం రాష్ట్రంలో సాధారణమైపోయిందన్నారు. 

ఖమ్మంలో రైతులకు బేడీలు వేశారని, జర్నలిస్టులను జైలుకు పంపారని, ఉద్యమించే ప్రజలను నిర్భంధించి పోలీసుస్టేషన్లలో చిత్రహింసలు పెట్టారని, నిరుద్యోగులకు జాబ్ ​క్యాలెండర్ ​రిలీజ్​ చేయలేదని, నోటిఫికేషన్లు లేవని, పేపర్ల లీకేజీలతో రాష్ట్రం అస్థవ్యవస్థమైందన్నారు. రాష్ర్టంలో బీజేపీ విస్తరణను అడ్డుకుందామన్నారు. టీపీజేఏసీ నాయకులు రవిచంద్ర ,వనమాల, వేణు, శంకర్​రావు, రామస్వామి పాల్గొన్నారు.