బషీర్ బాగ్, వెలుగు : ప్రకృతిని, ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆరోపించారు. హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక మంగళవారు నిర్వహించిన సమావేశంలో హరగోపాల్ పాల్గొని మాట్లాడారు. ఈ నెల 12న చత్తీస్ గడ్ ఆబూజ్ మడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ బూటకమని ఆరోపించారు.
ఆదివాసులను అడవి నుంచి దూరం చేసేందుకే చేస్తున్నారన్నారు. ఎన్ కౌంటర్లు జరిగినప్పుడు వాస్తవాలను తెలుసుకొనేందుకు నిజనిర్దారణ కమిటీ నాయకులు వెళ్తే అనుమతించడం లేదని అన్నారు. తాము వెళ్తే ఎన్ కౌంటర్లన్నీ బూటకమే అని తెలుతాయని, అందుకే తమను అడ్డుకుంటున్నారన్నారు. ఆదివాసీ ప్రజలకు సంఘీభావంగా పౌర సమాజం అండగా నిలవాలని హరగోపాల్ విజ్ఞప్తి చేశారు.