ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య కోదండరాం వారధిగా ఉండాలి

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య కోదండరాం వారధిగా ఉండాలి

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఎమ్మెల్సీ కోదండరాం వారధిగా ఉండాలని ప్రొఫెసర్  హరగోపాల్ సూచించారు. ప్రజలు,  నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తూ, క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. శనివారం హైదరాబాద్ లోని బోరబండలోని సెంటర్  ఫర్  దళిత్  స్టడీస్  క్యాంపస్ లో శని, ఆదివారాలు టీజేఎస్  నేతలకు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ తరగతులకు ప్రొఫెసర్  హరగోపాల్, ప్రొఫెసర్  శాంత సిన్హా, పార్టీ చీఫ్  కోదండరాంతో పాటు పార్టీకి చెందిన అన్ని జిల్లాల నేతలు అటెండ్ అయ్యారు. 

హరగోపాల్  మాట్లాడుతూ తెలంగాణలో టీజేఎస్  మినహా ఏ పార్టీకి తెలంగాణ పేరు, ఆత్మ లేదన్నారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ  పార్టీ నేతలు ఓపిక పట్టాలని, అందరికీ పదవులు వస్తాయన్నారు. కార్పొరేషన్  పదవుల్లో టీజేఎస్  నేతలకు చోటు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాగా, వచ్చే నెల 30న హైదరాబాద్ లో పార్టీ ప్లీనరీ నిర్వహించాలని నిర్ణయించారు.