బడ్జెట్​లో విద్యకు 20%  కేటాయించాలి : ప్రొఫెసర్​ జగ్​ మోహన్​సింగ్

బడ్జెట్​లో విద్యకు 20%  కేటాయించాలి : ప్రొఫెసర్​ జగ్​ మోహన్​సింగ్

పంజాగుట్ట, వెలుగు: విద్యకు రాష్ట్ర బడ్జెట్​లో 20 శాతం, కేంద్ర బడ్జెట్​లో 10 శాతం నిధులు కేటాయించాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో శుక్రవారం అఖిల భారత విద్యాహక్కు వేదిక, విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో భగత్​ సింగ్​మేనల్లుడు ప్రొఫెసర్​జగ్​మోహన్​సింగ్, ప్రొ. చక్రధరరావు , ప్రొ. హరగోపాల్, ప్రొ. లక్ష్మినారాయణ కలిసి మాట్లాడారు.

అందరికీ విద్య కల్పించడమే సోషల్ జస్టిస్ అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్య ప్రాధాన్యాన్ని గుర్తించి బడ్జెట్​లో 20 శాతం నిధులు కేటాయించాలని కోరారు. ముఖ్యంగా యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి, రాష్ట్రాల హక్కులను కాలరాసే యూజీసీ రెగ్యులేషన్​ను వ్యతిరేకించాలన్నారు.