బొగ్గు గనుల ప్రైవేటీకరణను ప్రోత్సహించే బీజేపీని ఓడగొట్టాలి: కోదండరాం

బొగ్గు గనుల ప్రైవేటీకరణను ప్రోత్సహించే బీజేపీని ఓడగొట్టాలి: కోదండరాం
  •   తెలంగాణ ఏర్పడినా కార్మికులకు ఆశించిన ఫలాలు దక్కలేదు
  •   అండర్​ గ్రౌండ్ ​గనుల ఏర్పాటుతో ఉపాధి విస్తరించాలి
  •   టీజేఎస్ ​ప్రెసిడెంట్ ​కోదండరాం  

గోదావరిఖని, వెలుగు: బొగ్గు గనుల ప్రైవేటీకరణను ప్రోత్సహించే బీజేపీని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడగొట్టాలని తెలంగాణ జన సమితి ప్రెసిడెంట్​ప్రొఫెసర్​కోదండరామ్​సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం గోదావరిఖనిలో జరిగిన సింగరేణి తెలంగాణ ఉద్యోగుం సంఘం మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన కోదండరామ్​మాట్లాడారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను ప్రోత్సహించే బీజేపీ ఒకవైపు, మరోవైపు సంపద ప్రజలకు దక్కాలని తాపత్రాయపడి ప్రజల భాగస్వామ్యం పెరగాలనే ఆలోచనతో కాంగ్రెస్​ఉన్నాయన్నారు.

ఈ నేపథ్యంలో కార్మికులు ప్రైవేటీకరణను వ్యతిరేకంగా రాబోయే పార్లమెంట్​ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారని, అయినా తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కలేదన్నారు. సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులను పెంచి..తక్కువ జీతాలు ఇస్తూ..లాభాలను కొద్ది మంది కాంట్రాక్టర్లకే ఇస్తున్నారన్నారు. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఆశించిన మార్పు జరిగిందని, ఇందులో సింగరేణి కార్మికులు కూడా పెద్ద పాత్ర పోషించారన్నారు.

కార్మికులు ఆశించినట్టుగా సింగరేణిలో అండర్​గ్రౌండ్​ మైన్లను పెంచి ఉపాధి అవకాశాలను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పలు డిమాండ్లతో తీర్మానం చేశారు. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె.గట్టయ్య, జనరల్​ సెక్రెటరీ మిట్టపల్లి కుమారస్వామి, వివిధ యూనియన్ల ప్రతినిధులు గురిజాల రవీందర్, ఎండీ మునీర్, రియాజ్ అహ్మద్, కె.విశ్వనాథ్, రాములు, ఈ.నరేశ్, దేవి సత్యం, వెంగల కనకయ్య, మీర్జా సలీం బిగ్, భీమయ్య, జనగాం కుమార్, ఎం.వెంకటేశం, చీకటి వెంకటేశం, పొగాకుల శేఖర్, రాయపోశం, కన్నాల రాయలింగు పాల్గొన్నారు.