తెలంగాణ ప్రయోజనల కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని జన సమితి పార్టీ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బస్సు యాత్ర సందర్భంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని జన సమితి పార్టీ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం కలిశారు. ప్రస్తుతం కరీంనగర్ లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీతో.. 2023, అక్టోబర్ 20వ తేదీ శుక్రవారం ఉదయం కరీంనగర్ వీ పార్క్ హోటల్ లో కోదండరామ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని ప్రొఫెసర్ కోదండరామ్ ను రాహుల్ గాంధీ కోరినట్లు సమాచారం.
పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రెండు మూడు చోట్లలో సీట్లను కోదండరామ్ అడుగనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ బలహీనం గా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ముదోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను జనసమితి ఆశిస్తుంది. కాగా రాహుల్ గాంధీ భేటీతో ఇవాళ కాంగ్రెస్-జన సమితి పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
.