ఐక్యతతోనే బీసీలకు రాజ్యాధికారం :ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్

ఐక్యతతోనే బీసీలకు రాజ్యాధికారం :ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్

హుజూరాబాద్ రూరల్, వెలుగు: బీసీలు స్వతంత్రంగా, ఐక్యంగా ఉన్నప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని సామాజిక న్యాయ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ అన్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలో బీసీ కులగణన సాధన సమితి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు ఐక్యంగా లేకపోవడం వల్లే అగ్రవర్ణాలవారి ఆటలు సాగుతున్నాయన్నారు. బీసీలు ఇప్పటివరకు వివిధ పార్టీలో ఉండి ఆ పార్టీల అభివృద్ధి కోసమే పనిచేశారన్నారు.

కానీ ఆ పార్టీల బీసీల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఓబీసీ వ్యక్తి నరేంద్రమోదీ ప్రధానిగా ఉన్నా ఆ వర్గాలకు ప్రయోజనం జరగడం లేదన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినప్పటికీ ఆ విషయంలో అడుగు ముందుకు పడడం లేదన్నారు. సదస్సులో కులగణన సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు గాలిబు అమరేందర్, ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్,  రైతు సమన్వయ సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి ఎరుకల రాజన్న, కేయూ ప్రొఫెసర్ కె.వీరస్వామి, డీఎల్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వాడి సుదర్శన్, సాధన సమితి హుజూరాబాద్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి రవీందర్ పాల్గొన్నారు.