జైల్లో కులాన్ని బట్టి పని ఇస్తారు..చిత్రహింసలు పెట్టారు : మాజీ ప్రొఫెసర్ సాయిబాబా

జైల్లో కులాన్ని బట్టి పని ఇస్తారు..చిత్రహింసలు పెట్టారు : మాజీ ప్రొఫెసర్  సాయిబాబా

 తనను జైల్లో చిత్రహింసలు పెట్టారని చెప్పారు  ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబు .  జైలు నుంచి బయటికి వచ్చిన 5 నెలల తర్వాత సాయిబాబా ఇవాళ మీడియాతో మాట్లాడారు.  10 ఏళ్ల తర్వాత తాను స్వేచ్ఛగా తెలంగాణలో మాట్లాడుతున్నానని చెప్పారు. ఢిల్లీలో కిడ్నాప్ చేసి అక్రమంగా అరెస్టు చేశారని చెప్పారు.  వికలాంగుడని కూడా చూడకుండా జైల్లో తనను  చిత్ర హింసలు పెట్టారని చెప్పారు. తనకు 21రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నాయన్నారు.

 జైల్లో అండా సెల్ లో ప్రత్యేకమైన ఒక రూమ్ లో నిర్బంధించి వీల్ చైర్  కూడా ఇవ్వలేదన్నారు సాయిబాబా.  అమ్మ చనిపోయినా  అంత్యక్రియలకు కూడా అనుమతివ్వలేదన్నారు.  అమ్మ ను చివరి చూపు కూడా నేను నోచుకోనియ్యలేదన్నారు. తనకు కోర్టులు కూడా న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  నార్త్ ఇండియన్ జైల్లో కుల వ్యవస్థ విచ్చలవిడిగా ఉందన్నారు.  కులాన్ని చూసి జాబ్ ఇస్తారని చెప్పారు.  జైల్ మ్యాన్యువల్ లో కులాన్ని బట్టి పని ఇస్తారని చెప్పారు. 

మావోయిస్టులతో సంబంధం ఉందన్న కేసులో జైలు శిక్ష  అనుభవించిన  మాజీ ప్రొఫెసర్ సాయిబాబా 2024 మార్చి7 న నాగ్ పూర్ జైలు నుంచి విడుదలయ్యారు. నక్సలైట్లతో చేతులు కలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని 2014లో మహారాష్ట్ర పోలీసులు ఆయనని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరో ఆరుగురికి 2017లో గడ్చిరోలి సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అప్పటి నుంచి వీల్ ఛైర్ కి పరిమితమైన సాయిబాబా జైలులోనే శిక్షను అనుభవించారు. సుప్రీం కోర్టు ఆదేశంతో నాగ్ పూర్ హైకోర్టు ఈ కేసును విచారించి సాయిబాబా నిర్థోషి అని తేల్చి చెప్పింది. ఆయన్ని వెంటనే విడుదల చేయాలని మార్చి 5న 2024న తీర్పు ఇచ్చింది.